Pathaan: యూఎస్ లో నంబర్ వన్ మూవీగా నిలిచిన పఠాన్

Pathaan movie - షారూక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా యూఎస్ లో నంబర్ వన్ మూవీగా నిలిచింది. అత్యథికంగా ఫుట్ ఫాల్ కలిగిన ఇండియన్ సినిమాగా ఇది నిలిచింది.

Advertisement
Update: 2023-02-08 04:13 GMT

Pathaan Movie Review: పఠాన్ మూవీ రివ్యూ

అమెరికా బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమాను "పఠాన్" అధిగమించింది. కేవలం రెండు వారాల్లోనే ఈ ఘనత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది షారూక్ మూవీ. సోమవారం వసూళ్లతో, ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్ 14.3 మిలియన్ డాలర్లను "పఠాన్" అధిగమించింది.

రాబోయే వారాల్లో, "పఠాన్" మరో 3 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బాహుబలి-2 లైఫ్ టైమ్ వసూళ్లను కూడా పఠాన్ క్రాస్ చేయడం గ్యారెంటీ. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. టికెట్ సేల్స్, ఆక్యుపెన్సీ రీత్యా.. యూఎస్ లో నంబర్ వన్ ఇండియన్ హిట్ గా పఠాన్ నిలిచే అవకాశాలున్నాయి.

బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రిలీజైన కొత్తలో 20 డాలర్ల నుండి 40 డాలర్ల వరకు టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. అలా ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. "పఠాన్"కి మాత్రం ప్రారంభం నుండి 12 డాలర్లకే టికెట్ రేటు పెట్టారు. దీంతో టికెట్లు బాగా తెగాయి. ఫుట్ ఫాల్ కూడా పెరిగింది.

ప్రేక్షకుల హాజరు (ఫుట్ ఫాల్) పరంగా చూసుకుంటే, అమెరికాలో రిలీజైన భారతీయ చిత్రాల్లో నంబర్ వన్ హిట్‌గా నిలిచింది పఠాన్. అయితే "పఠాన్" ఫైనల్ లైఫ్ టైమ్ గ్రాస్ ఎంత ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News