Nenu Student Sir Trailer Review: నేను స్టూడెంట్ సర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

Nenu Student Sir Movie Trailer Review: బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update: 2023-05-22 10:55 GMT

Nenu Student Sir Trailer: నేను స్టూడెంట్ సర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

బెల్లంకొండ గణేష్ రెండో సినిమా రెడీ చేశాడు. మొదటి సినిమా స్వాతిముత్యంతో ఆకట్టుకున్న ఈ నటుడు, ఇప్పుడు తన రెండో సినిమా కోసం థ్రిల్లర్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా పేరు 'నేను స్టూడెంట్ సార్!'. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. SV2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై బ్యానర్ పై సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మించాడు. ఇంతకుముందు ఈ నిర్మాత 'నాంది' అనే సినిమాను నిర్మించాడు.

ఇక 'నేను స్టూడెంట్ సార్!' సినిమా విషయానికొస్తే.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల చేశారు. హీరో ఐఫోన్‌ను ప్రదర్శించడంతో ట్రయిలర్ ప్రారంభమవుతుంది. అతను దానిని తన సొంత బ్రదర్ లా చూస్తాడు. అయితే, ఒక హత్య కేసులో పోలీసులకు అతనిపై బలమైన సాక్ష్యం లభించడంతో అదే ఫోన్ అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అతని ఖాతాలో కోటి 75 లక్షల రూపాయల డబ్బు డిపాజిట్ కావడంతో పరిస్థితులు మరింత దిగజారుతాయి. వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేది స్టోరీ.

రాఖీ ఉప్పలపాటి ఒక ఆసక్తికరమైన కథతో ముందుకు వచ్చాడు. కథనంలో మలుపులతో ఆకర్షించాడు. ట్రయిలర్ లో గణేష్ తన పాత్రతో మెప్పించాడు. సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాతో అవంతిక దాసాని హీరోయిన్ గా పరిచయమౌతోంది. ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు ఈమె. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ కు మరింత లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చింది.

ట్రలర్ యువతను ఆకట్టుకోవడంతో పాటు థ్రిల్లర్‌లను ఇష్టపడే వారిని కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. జూన్ 2న 'నేను స్టూడెంట్ సార్!' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Full View


Tags:    
Advertisement

Similar News