Malli Pelli - మళ్లీ పెళ్లిని కృష్ణకు అంకితం చేసిన నరేష్

Malli pelli movie - మళ్ళీ పెళ్ళి సినిమాని కృష్ణ కి అంకితం చేశారు నరేష్.

Advertisement
Update: 2023-05-29 05:09 GMT

తన నిజజీవిత ఘటనలతో తెరకెక్కించిన మళ్లీ పెళ్లి సినిమాను సూపర్ స్టార్ కృష్ణకు అంకితం చేశాడు నరేష్. పవిత్రతో తను సాగిస్తున్న లివ్-ఇన్ రిలేషన్ షిప్ ఆధారంగా ఈ సినిమాను తీసిన నరేష్.. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ను మరింత ముందుకు తీసుకెళ్తానంటున్నాడు. 


"తన భార్య ఆలోచనలని ప్రజల్లోకి తీసుకు రావడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించారు. ఇది ప్రపంచంలో చాలా అరుదు. రియల్ బోల్డెస్ట్ కపుల్ అంటే కృష్ణ గారు, విజయ నిర్మల గారు. వాళ్ళ రథం మళ్ళీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్ మళ్ళీ ప్రారంభించాను. చాలా సంతోషంగా గర్వంగా ఉంది. మళ్ళీ పెళ్లి కి వచ్చిన రిజల్ట్ తో కృష్ణగారు, విజయ నిర్మల గారి ఆశీస్సులు అందుకున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా సవినయంగా సగర్వంగా మళ్ళీ పెళ్లి చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను."


ఈ సినిమాకు సంబంధించి కన్నడ వెర్షన్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నాడు నరేష్. కన్నడ వెర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటున్నాడు. మళ్లీ పెళ్లి సినిమా తన కెరీర్ లో మరపురాని సినిమా అవుతుందని చెబుతున్నాడు.


ఇక తన కెరీర్ పై స్పందిస్తూ.. ఇకపై పూర్తిగా నటనపైనే దృష్టిపెడతానని ప్రకటించాడు నరేష్. బతికున్నంత కాలం నటిస్తానని, మంచి కథలు దొరికితే నిర్మాతగా కూడా సినిమాలు తీస్తానని, మరోవైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తానని ప్రకటించాడు.

Tags:    
Advertisement

Similar News