Meet Cute: మీట్ క్యూట్ టీజర్ ఎలా ఉందంటే..!

నాని సమర్పణలో వస్తున్న సినిమా మీట్ క్యూట్. తాజాగా ఈ సినిమా టీజర్ మార్కెట్లోకి వచ్చింది. అదెలా ఉందో చూద్దాం

Advertisement
Update: 2022-11-12 11:52 GMT

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఆంథాలజీ "మీట్ క్యూట్". నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సిరీస్ హక్కులని సోనీ లివ్ పొందింది, త్వరలో తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది. ఈరోజు "మీట్ క్యూట్" టీజర్ ని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు.

అపరిచితుల క్యూట్ మీటింగ్స్, ఆహ్లాదకరమైన సంభాషణలు, భావోద్వేగాలని టీజర్ అద్భుతంగా ప్రజంట్ చేసింది. ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, హార్ట్ బ్రేక్, నమ్మకం, సంతోషం ఇలా అన్ని భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ''చిన్న చిన్న గొడవలు వల్ల రిలేషన్ షిప్స్ ఫెయిల్ కావు. ఫైట్ చేయటం ఆపేసినప్పుడు ఫెయిల్ అవుతాయి'' అనే డైలాగ్ తో టీజర్ ముగించడం క్యూరియాసిటీని పెంచింది.

దీప్తి గంటా తన మొదటి ప్రయత్నంలోనే రచయితగా, దర్శకురాలిగా ఓ మంచి ప్రయత్నం చేసినట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది. సిరీస్ లో కథలన్నీ అందరూ రిలేట్ చేసుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ఈ సిరీస్ కు సత్యరాజ్, రోహిణి మెయిన్ పిల్లర్స్ కాగా, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా హీరోయిన్లుగా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా హీరోలుగా నటించారు. ఎవరి పాత్రల్ని వాళ్లు బాగా పోషించినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.

వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. టీజర్ విజువల్ ట్రీట్ గా ఉంది. విజయ్ బుల్గానిన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సరైన మూడ్‌ని సెట్ చేశాడు. త్వరలోనే ఈ టీజర్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటిస్తారు.


Full View


Tags:    
Advertisement

Similar News