Dasara Movie - దసరా సాంగ్ పై నాని రియాక్షన్ ఇది

Dasara Movie Song Ori Vaari - Lyrical Video - దసరా మూవీ గురించి గొప్పగా చెబుతున్నాడు నాని. ఇప్పుడా సినిమాలో సాంగ్స్ గురించి కూడా అంతే గొప్పగా చెబుతున్నాడు.

Advertisement
Update: 2023-02-14 17:46 GMT

దసరా సినిమాపై ఆది నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్టవుతుందని, తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని చెప్పుకొస్తున్నాడు. నాని కాన్ఫిడెన్స్ చూసి చాలామంది ముచ్చటపడుతున్నారు కూడా.

ఇప్పుడీ సినిమా నుంచి పాటలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఆమధ్య దోస్తాన్ సాంగ్ రిలీజైంది. తాజాగా ఓరి వారి అనే లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు నాని. సినిమా గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడో, అంతకంటే గొప్పగా ఈ సాంగ్ గురించి చెబుతున్నాడు.

"దసరా లో నాకు చాలా ఇష్టమైన పాట ఓరి వారి. నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న పాటిది. ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి, ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్. శ్రీమణి చాలా అద్భుతంగా రాశారు. సంతోష్ నారాయణ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. విజువల్ గా ఈ పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్. మార్చి 30న స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు స్టన్ అయిపోతారు. వినే కొద్ది నచ్చే పాటిది. నెలలు తరబడి నా చెవిలో మోగుతూనే ఉంది. అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను."

ఇలా ఈ సాంగ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు నాని. అతడు చెప్పినట్టుగానే ఓరి వారి సాంగ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. 


Full View


Tags:    
Advertisement

Similar News