Rangabali Movie: నాగశౌర్య కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

Naga Shourya New Movie: కొత్త జానర్ లో సరికొత్త సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఈ మూవీకి రంగబలి అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

Advertisement
Update: 2023-03-23 14:59 GMT

Rangabali Movie: నాగశౌర్య కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

హీరో నాగశౌర్య భిన్నమైన జానర్స్ ట్రై చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కు ‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘రంగబలి’ అనే టైటిల్ చాలా ఇంట్రస్టింగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్‌ గా ఈ సినిమా ఉండబోతోందని అనౌన్స్ మెంట్ వీడియోని చూస్తే అర్ధమౌతోంది.

ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ అయ్యాడు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సినిమా కోసం పని చేస్తున్న మొత్తం టీమ్ సొంత ఊర్లు పేర్లు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రానికి దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్‌ గా కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది సందర్భంగా, టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో ప్రమోషన్లు ప్రారంభించారు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు నాగశౌర్య.

Tags:    
Advertisement

Similar News