Nagarjuna - 'సూపర్' లుక్ లోకి మారిన నాగార్జున

Nagarjuna new Look - నాగార్జున కొత్త లుక్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. మరోసారి సూపర్ సినిమాను గుర్తుకుతెస్తోంది.

Advertisement
Update: 2023-02-13 17:02 GMT

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాతోనే అనుష్క హీరోయిన్ గా పరిచయమైంది. అందులో నాగార్జున లుక్ అందర్నీ ఆకట్టుకుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నాగ్ లుక్ కు అంతా ఫిదా అయ్యారు.

మళ్లీ ఇన్నాళ్లకు అదే లుక్ రిపీట్ చేశాడు నాగ్. అవును.. ప్రస్తుతం నాగార్జున సూపర్ సినిమా లుక్ లోకి మారాడు. మరీ అంత పొడుగ్గా జుట్టు పెంచకపోయినా, హెయిర్ స్టయిల్ దాదాపు అలానే ఉంది. మిగతా మేకోవర్ మొత్తం దాదాపు పూర్తయింది.

త్వరలోనే బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. కెరీర్ లో నాగ్ కు ఇది 99వ చిత్రం. ఈ సినిమా కోసమే నాగ్ ఇలా మేకోవర్ అయ్యాడనే ప్రచారం నడుస్తోంది.

బహుశా, ఆ ప్రచారంలో నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే, నాగ్ ఎప్పుడిలా మేకోవర్ అయినా అది కొత్త సినిమా కోసమే. పైగా సినిమా లాంఛింగ్ కు ముందే ఇలా తన మేకోవర్ ను బయటపెట్టడం నాగ్ మరో స్టయిల్. 

Tags:    
Advertisement

Similar News