NagaChaitanya - దర్శకుడ్ని కౌగిలించుకున్న నాగచైతన్య

NagaChaitanya Custody Movie - కస్టడీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు హీరో నాగచైతన్య.

Advertisement
Update: 2023-05-03 17:32 GMT

నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాతో నాగచైతన్య కోలీవుడ్ కు పరిచయమౌతుంటే, ఈ సినిమాను డైరక్ట్ చేసిన వెంకట్ ప్రభు, టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ కథ విన్న వెంటనే దర్శకుడ్ని కౌగిలించుకున్నాడ నాగచైతన్య.

"ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం చేతిలో ఉంటే తను ఎంత దూరం వెళ్తాడనే పాయింట్ వెంకట్ ప్రభు చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ కథకు నేను ఎందుకు అని అడిగినపుడు.. లవ్ స్టొరీలో నా నటన నచ్చిందని, ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని చెప్పారు. నాకు ఎప్పటి నుంచో తమిళ్ లో సినిమా చేయాలనే ఉండేది. వెంకట్ ప్రభు గారితో అక్కడ లాంచ్ కావడం, ఆయన ఇక్కడకి పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. వెంకట్ ప్రభుకి అద్భుతమైన స్క్రీన్ ప్లే టెక్నిక్ ఉంది. కథ విన్నప్పుడు ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది."

ఈరోజు మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాగచైతన్య, ఈ విషయాన్ని బయటపెట్టారు. 12వ తేదీన థియేటర్లలోకి వస్తున్న కస్టడీ సినిమాలో ఓ కొత్త పాయింట్ ఉందని, అది అందరికీ నచ్చుతుందని చెబుతున్నాడు.

కస్టడీ లో చాలా లేయర్లు ఉన్నాయని, దాదాపు ప్రతి 10 నిమిషాలకు ఒక లేయర్ రివీల్ అవుతుందని చెబుతున్నాడు నాగచైతన్య. ఈ సినిమా శివ అనే కానిస్టేబుల్ పాత్ర పోషించాడు చైతూ. 

Tags:    
Advertisement

Similar News