Custody Movie Teaser review: కస్టడీ మూవీ టీజర్ ఎలా ఉందంటే!

Naga Chaitanya's Custody Movie Teaser review: నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2023-03-16 17:04 GMT

Custody Movie Teaser review: కస్టడీ మూవీ టీజర్ ఎలా ఉందంటే!

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. వేసవిలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.

నాగచైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’ అనే వాయిస్ ఓవర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

నాగచైతన్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. కృతి శెట్టి అతని గర్ల్‌ఫ్రెండ్‌గా కూల్‌గా కనిపించింది. అరవింద్ స్వామి తన విలనీ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కి ఎక్స్‌ట్రా ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. శరత్‌కుమార్, ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో కన్విన్సింగ్‌గా కనిపించారు.

ఎప్పుడూ కొత్తదనం ఉండే కథలనే ఎంచుకునే జీనియస్ వెంకట్ ప్రభు మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. కథాంశం గురించి పెద్దగా వెల్లడించకుండా, టీజర్‌ చూపించిన విధానం క్యురియాసిటీని పెంచింది.

ఎస్ఆర్ కతీర్ కెమెరా పనితనం బాగుంది. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ద్వయం చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను, హీరో అనుభవించే బాధను ఎలివేట్ చేసింది. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  


Full View


Tags:    
Advertisement

Similar News