LEO Movie | రూ.400 కోట్ల క్లబ్ లో చేరిన లియో

LEO Movie - విజయ్ హీరోగా నటించిన సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరింది.

Advertisement
Update: 2023-10-24 17:01 GMT

Leo Movie Review: లియో - రివ్యూ! {2.25/5}

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ, విజయవంతంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోలీవుడ్ టాప్ 5 సినిమాల జాబితాలోకి చేరి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. లియో 5 రోజుల్లో 400 కోట్ల కలెక్షన్స్‌ని చేరుకుంది. ఇదో పెద్ద రికార్డ్.

పండుగ సీజన్ కావడంతో.. సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్‌లను కొనసాగిస్తోంది లియో. రజనీకాంత్ నటించిన 2.O, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, జైలర్ తర్వాత ఈ క్లబ్‌లో చేరిన 5వ కోలీవుడ్ చిత్రం లియో. ఈ వారం ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో హాయిగా చేరుతుంది. ఎందుకంటే, పాన్ ఇండియా లెవెల్లో లియోకు పోటీగా మరో సినిమా లేదు.

అటు బాలీవుడ్ లో కూడా లియో సినిమా బ్రహ్మాండంగా నడుస్తోంది. దసరా సీజన్ లో బాలీవుడ్ సినిమాలేవీ లేకపోవడం, గణపత్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. లియోకు ఆదరణ పెరిగింది. బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ అన్నీ లియోకే వసూళ్లు వస్తున్నట్టు స్పష్టం చేశాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ సంగీతం అందించాడు. లియోతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మరోసారి మెరిసింది.

Tags:    
Advertisement

Similar News