Dasara Movie - కీర్తిసురేష్ కు స్క్రిప్ట్ అర్థం కాలేదంట

Dasara Movie - దసరా సినిమాలోహీరోయిన్ గా నటించింది కీర్తిసురేష్. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఆమెకు అర్థంకాలేదంట.

Advertisement
Update: 2023-03-15 02:50 GMT

స్క్రిప్ట్ అర్థంకాకుండా సినిమాకు ఓకే చెప్పడం సాధ్యమా? దసరా విషయంలో కీర్తిసురేష్ అదే పని చేసిందంట. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని వెల్లడించాడు. దసరా స్క్రిప్ట్ కీర్తిసురేష్ కు అర్థంకాలేదనే విషయాన్ని అతడు బయటపెట్టాడు.

"మొదట మా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలని కీర్తి సురేష్ వద్దకు పంపించాను, స్క్రిప్ట్ చెప్పమని పంపాను. వెళ్లి 3 గంటల పాటు స్క్రిప్ట్ నేరేట్ చేసి వచ్చాడు. ఆ తర్వాత కీర్తికి నేను ఫోన్ చేశాను. ఒక్క ముక్క అర్థంకాలేదని నాతో చెప్పింది. మా డైరక్టర్ శ్రీకాంత్ తెలంగాణ యాసలో మాట్లాడతాడు. దాన్ని కీర్తి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఆమెకు తెలుగు వచ్చు, కానీ తెలంగాణ యాసతో కష్టం. అందుకే దసరా స్క్రిప్ట్ అర్థం చేసుకోలేకపోయింది."

తమిళ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నాని. ఆ తర్వాత కీర్తిసురేష్ కోసం ఓ ట్రాన్స్ లేటర్ ను ఏర్పాటుచేశారట. ఆ అనువాదకుడు చెప్పిన స్క్రిప్ట్ విన్న వెంటనే కీర్తిసురేష్ దసరా సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందంట.

నాని-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయబోతున్నారు. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీనికోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాడు నాని.

Tags:    
Advertisement

Similar News