Kashmira: అప్పుడు నర్తనశాల.. ఇప్పుడు విష్ణుకథ

Kashmira Paradesi - వినరో భాగ్యము విష్ణుకథ తన కెరీర్ కు చాలా కీలకం అంటోంది కష్మీర. ఈ అమ్మాయి ఇంకా ఏం చెబుతోందంటే..?

Advertisement
Update: 2023-02-15 15:37 GMT

వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది హీరోయిన్ కశ్మీర. ఇక్కడ మరోసారి అని ఎందుకన్నామంటే, ఆమె కొత్త హీరోయిన్ కాదు. అప్పుడెప్పుడో ఓ సినిమా చేసింది, ఇప్పుడిది రెండో సినిమా అన్నమాట. దీనిపై కశ్మీర స్వయంగా రియాక్ట్ అయింది.

"నర్తనశాల సినిమా తర్వాత తిరుపతి నేపథ్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్ లో చేయడం నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు."

ఇలా తన రెండో సినిమాపై స్పందించింది కశ్మీర. మహారాష్ట్ర రాజ్ పుత్ వంశానికి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్, యాక్టింగ్ పై మక్కువతో ఇటువైపు వచ్చింది. ఇకపై హీరోయిన్ గానే కెరీర్ కొనసాగిస్తానంటోంది.

ప్రస్తుతం తెలుగులో మరో సినిమాకు సైన్ చేసేందుకు రెడీ అవుతుంది కశ్మీర. దీంతో పాటు ఓ తమిళ, మరో హిందీ సినిమా కూడా చేయబోతోంది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News