Hunt Movie Trailer: హంట్ మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే!

Hunt Movie trailer review: సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు

Advertisement
Update: 2023-01-18 16:40 GMT

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ప్రభాస్ చేతుల మీదుగా హంట్ ట్రయిలర్ రిలీజైంది. 


'హంట్' సినిమాలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించాడు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అందులో మెమరీ లాస్‌కు ముందు కలిసిన వ్యక్తులు, జరిగిన ఘటనలు అర్జున్‌కు గుర్తు లేవు కానీ... పోలీస్ ట్రైనింగ్, భాషలు, స్కిల్స్ గుర్తు ఉన్నాయని చెప్పారు. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే...  


''ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి'' అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్‌లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్‌లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. 


ట్రయిలర్ లో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ స్టంట్స్ ఉన్నాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్ అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.


Full View


Tags:    
Advertisement

Similar News