Hidimbha Movie - హిడింబ మూవీ ట్రయిలర్ రివ్యూ

Hidimbha Movie Trailer Review - అశ్విన్ హీరోగా నటించిన సినిమా హిడింబ. ఈ సినిమా ట్రయిలర్ ను సాయితేజ్ రిలీజ్ చేశాడు

Advertisement
Update: 2023-05-27 09:13 GMT

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో SVK బ్యానర్‌ పై శ్రీధర్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది. హీరో సాయితేజ్ ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశాడు. రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ , బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం ఈ ట్రయిలర్ లో ప్రత్యేకతలు.

1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసులు , హోం మంత్రిపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కిడ్నాపర్ ఎరుపు రంగును టార్గెట్ చేస్తున్నాడు. నాలుగు కొమ్ములతో మేక ముసుగును ధరించాడు. ఆ కిడ్నాపర్‌ కి ఏం కావాలి? మిస్సింగ్ కేసులకు 1908లో జరిగిన దానికి సంబంధం ఏమిటి అనేది హిడింబ స్టోరీ.

ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉంటాయంటున్నారు మేకర్స్. అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించాడు. అతని పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ని సాలిడ్ గా చేశాడు. నందితా శ్వేత కూడా ఒక పోలీసు అధికారి గా చూపించారు.


Full View


Tags:    
Advertisement

Similar News