Virupaksha Movie Song: విరూపాక్ష సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

Virupaksha Movie Song Nachavule Nachavule: సాయితేజ్ హీరోగా నటిస్తున్న సినిమా విరూపాక్ష. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది.

Advertisement
Update: 2023-03-26 06:22 GMT

Virupaksha OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ విరూపాక్ష. ఇదొక మిస్టిక్ థ్రిల్లర్. ఇందులో సంయుక్తమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగించింది.

తాజాగా ఈ చిత్రం నుంచి నచ్చావులే.. నచ్చావులే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం సమాకూర్చగా, కార్తీక్ ఆలపించారు. తొలి సాంగ్ గా విడుదలైన ఈ లిరికల్ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ చిత్రానికి జీనియస్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ సినిమాపై సాయితేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.


Full View


Tags:    
Advertisement

Similar News