S5 Movie: కథ మొత్తం చెప్పేసిన దర్శకుడు

S5 movie: భరత్ దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమా ఎస్5. తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ లాంటి నటులు నటించిన ఈ సినిమా కథను రిలీజ్ కు ముందే చెప్పేశారు.

Advertisement
Update: 2022-12-28 04:23 GMT

S5.. ఓ చిన్న సినిమా. తారకరత్న హీరోగా నటించిన సినిమా. ప్రిన్స్, సునీల్, అలీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు హైప్ తెచ్చేందుకు మేకర్స్ కొత్త ప్రయత్నం చేశారు. సినిమా స్టోరీ మొత్తం ముందే చెప్పేశారు. ఇదేదో లైన్ లా చెప్పడం కాకుండా.. మొత్తం విడమర్చి చెప్పేశారు.

"హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఒక ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకుంటాయి. ఆ ఒక్క బోగికే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సుబ్బు అనే పాత్రను తారకరత్న పోషించారు. ఆయన సీఎం సాయి కుమార్ కొడుకు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ కోచ్ ను బుక్ చేసుకుంటారు. ఇందులోని వారంతా బోగిని

అలంకరించుకుని పార్టీ చేసుకుంటారు. అప్పుడు సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. నో ఎగ్జిట్ అన్నమాట. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరుగుతుంది. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా

ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథనం ఊహకందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా చూపిస్తున్నాం."

ఇలా కథ మొత్తం ముందే చెప్పేశాడు దర్శకుడు భరత్ కోమాలపాటి. ఈ సినిమా ప్రారంభం ముందు ఒక యానిమేటెడ్ సాంగ్ వస్తుందని, అందులో కథను పరిచయం చేశాక సినిమా మొదలవుతుందని కూడా వెల్లడించాడు. అంతేకాదు, ఇది హారర్ మూవీ కాదనే విషయాన్ని కూడా బయటపెట్టాడు.




Tags:    
Advertisement

Similar News