Balagam Movie: ఆస్కార్ కు బలగం మూవీ?

Balagam Movie to Oscar: బలగం మూవీని ఆస్కార్ కు పంపిస్తామంటున్నారు దిల్ రాజు. ఈ మేరకు ఆయన ప్రొసీజర్ కూడా కనుక్కున్నారు.

Advertisement
Update: 2023-04-05 13:04 GMT

చిన్న సినిమాగా వచ్చిన బలగం, పెద్ద హిట్టయింది. దీన్ని కేవలం హిట్ అనడం కరెక్ట్ కాదేమో. తెలంగాణ పల్లెల్లో పరదాలు కొట్టుకొని మరీ ఈ సినిమాను చూస్తున్నారు. సినిమా చూసిన కొన్ని కుటుంబాలు తమ మధ్య గొడవలు మరిచిపోయి తిరిగి కలిసిపోతున్నాయి.

అంతలా కదిలించిన బలగం సినిమాను తీయడం తన అదృష్టం అంటున్నారు నిర్మాత దిల్ రాజు. అంతేకాదు.. ఈ సినిమాను ఆస్కార్ కు పంపిస్తానంటున్నారాయన.

"బ‌ల‌గం సినిమాను ఆస్కార్‌కు క‌చ్చితంగా పంపించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఏదో బ‌డ్జెట్ పెట్టాల‌నే వార్త‌లు వచ్చాయి. నేను కూడా కార్తికేయ‌తో దాని గురించి మాట్లాడాను. నిజానికి యుఎస్‌లో స్ట్రీమింగ్ చేయ‌టానికి కొంత బ‌డ్జెట్ పెట్టాలి. అదే వాళ్లు పెట్టారు. ఇక ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ సినిమా విషయానికి వ‌స్తే వాళ్లేం బ‌డ్జెట్ పెట్ట‌లేదుగా.’’

ఇలా బలగంను ఆస్కార్ కు పంపించే విషయంపై స్పందించారు దిల్ రాజు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడంతో, టాలీవుడ్ లో ఇప్పుడు చాలా సినిమా గురించి ఆస్కార్ చర్చ నడుస్తోంది. ఈమధ్య శాకుంతలం సినిమాపై కూడా ఆస్కార్ కోణంలో చర్చ జరిగింది.

Tags:    
Advertisement

Similar News