CSI SANATHAN: ఆది సాయికుమార్ కొత్త సినిమా టీజర్

ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ CSI SANATHAN. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు

Advertisement
Update: 2022-11-11 06:13 GMT

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.


క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా టీజర్ ను దర్శకుడు బాబి విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం 


విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పెర్మార్మెన్స్ చూపించాడు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ కనిపిస్తున్నాయి. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది.


తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని యూనిట్ అంటోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన మిషా నారంగ్ హీరోయిన్ గా నటించగా.. అలీ రెజా, నందిని రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పాటలు లేవని టాక్.


Full View


Tags:    
Advertisement

Similar News