చంద్రబాబును ఇంటర్వ్యూ చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ యాంకర్ గా అన్ స్టాపబుల్ సీజన్-2 రెడీ అవుతోంది. తొలి ఎపిసోడ్ లో చంద్రబాబును ఇంటర్వ్యూ చేశారు బాలయ్య.

Advertisement
Update: 2022-10-01 13:30 GMT

Unstoppable with NBK S2: రాజకీయ నాయకులతో ఫలితం దక్కుతుందా?

అన్ స్టాపబుల్ సీజన్-2 కోసం బాలయ్య తెగ కష్టపడుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సైతం దీని కోసం పక్కనపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో సీజన్-2 కోసం బాలయ్యపై ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీనికి ఎప్పట్లానే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజానికి ఈ ప్రమోషనల్ సాంగ్ ను వైజాగ్ లో బీచ్ లో షూట్ చేద్దాం అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్ వేసి షూట్ చేస్తున్నారు. కౌబాయ్ గెటప్ లో బాలయ్య ఉన్న స్టిల్ కూడా బయటకొచ్చింది.

ఓవైపు ప్రమోషనల్ సాంగ్ చేస్తూనే, మరోవైపు ఇంటర్వ్యూలు కానిస్తున్నాడు బాలయ్య. సీజన్-2 తొలి ప్రయత్నంగా తన బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ ను ఇంటర్వ్యూ చేశాడు. సీజన్-2లో ఇదే ఫస్ట్ ఎపిసోడ్ గా ప్రసారం అవుతుందా లేక మరో ఎపిసోడ్ తో లాంఛ్ అవుతుందా అనేది ఇంకా నిర్ణయించలేదు.

నిజానికి సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ను చిరంజీవితో ప్లాన్ చేయాలని అనుకున్నారు. అన్ స్టాపబుల్ క్రియేటివ్ హెడ్ అబ్బూరి రవి కూడా గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు చిరంజీవితో ఇంటర్వ్యూ పూర్తిచేయలేదు.

Tags:    
Advertisement

Similar News