బేబీ పనులు మొదలుపెట్టిన దేవరకొండ

ఆనంద్ దొవరకొండ తాజా చిత్రం బేబీ. ఈ సినిమా అప్ డేట్స్ చూద్దాం

Advertisement
Update: 2022-08-14 03:37 GMT

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

డిఫరెంట్ పాయింట్ తో సాయిరాజేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో ఆనంద్ దేవరకొండ పాత్ర సింపుల్ గా ఉంటూనే, చాలా కొత్తగా ఉంటుందట. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు మారుతి, ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారడంతో ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.

Tags:    
Advertisement

Similar News