Avika Gor: నిర్మాతగా మారిన హీరోయిన్ అవికా గోర్

Avika Gor - హీరోయిన్ అవికా గౌర్ నిర్మాతగా మారింది. ఆ సినిమాలో తనే హీరోయిన్ గా నటించింది కూడా.

Advertisement
Update: 2023-02-10 15:26 GMT

హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేంకాదు.. అలనాటి సావిత్రి నుంచి ఇప్పటితరం హీరోయిన్ల వరకు చాలామంది ప్రొడ్యూసర్లుగా తన లక్ చెక్ చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా చేరింది. తను నటించిన ఓ సినిమాను, తానే స్వయంగా నిర్మించింది ఈ బ్యూటీ.

"జీవితంలో ఫలానా చేయాలనే గోల్‌ మన మనసులో మెదిలిందంటేనే, దాని అర్థం.. మనం చేయగలమనే. మనకు ఆ సామర్థ్యం లేకపోతే, మన మనసులోకి ఆలోచనలు రావు. ప్రొడక్షన్‌ చేయాలని ఓ అర్ధరాత్రి అనుకున్నది కాదు. 21 ఏళ్ల వయసు నుంచీ అనుకుంటున్నా. న్యూయార్క్ అకాడమీకి వెళ్లి చదువుకున్నా, ఎడిటింగ్‌ కోర్సులు చేసినా, డైరక్షన్‌ కోర్సులు చేసినా, దాని అర్థం ఏంటంటే నేను సినిమాను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని. నటిగా మాత్రమే కొనసాగకుండా, సినిమాల్లో ఇంకా చాలా చేయాలని అనుకున్నా. ప్రొడక్షన్‌ చేయడం కూడా అందులో భాగమే. భవిష్యత్తులో నేను డైరక్షన్‌ కూడా చేస్తానేమో."

ఇలా తన మనసులో మాటను బయటపెట్టింది అవికా గోర్. పాప్ కార్న్ అనే సినిమాతో తెలుగులో ప్రొడ్యూసర్ గా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా కూడా నటించింది.

ఈ మూవీ రిజల్ట్ ఇంకా బయటకు రాకముందే, అప్పుడే మరో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ 2 సినిమాల్లో ఒకటి ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకోగా, ఇంకో సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని తెలిపింది.

Tags:    
Advertisement

Similar News