బాలకృష్ణకు నాగేశ్వరరావు మనవళ్ల స్ట్రాంగ్ కౌంటర్

''సెట్‌లో ఈయన ఉన్నారంటే నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునేవాళ్లం'' అంటూ మాట్లాడుతారు. ఈ స్పీచ్‌లో కొన్ని బూతు మాటలు కూడా వదిలేశారు బాలకృష్ణ.

Advertisement
Update: 2023-01-24 09:16 GMT

తన సహజగుణంతో బాలకృష్ణ చేసిన పొగరు వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో మాట్లాడిన బాలకృష్ణ.. అక్కడే ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్ గురించి మాట్లాడారు. ఈయన సెట్‌లో ఉంటే హుషారుగా ఉంటుందని చెబుతూ.. ''సెట్‌లో ఈయన ఉన్నారంటే నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునేవాళ్లం'' అంటూ మాట్లాడుతారు. ఈ స్పీచ్‌లో కొన్ని బూతు మాటలు కూడా వదిలేశారు బాలకృష్ణ.


అక్కినేని.. తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు. అటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ తీరును తప్పుపడుతున్నారు. ఇంతలో అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లు ముందుకొచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు ట్విట్టర్లో నాగచైతన్య, అక్కినేని అఖిల్ కౌంటర్ ఇచ్చారు. ''నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడమే'' అంటూ ఇద్దరూ ట్వీట్‌ చేశారు.


సాధారణంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యేందుకు చాలా మంది జంకుతుంటారు. కానీ, తన తాతను కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణకు నాగచైతన్య, అఖిల్‌ ధైర్యంగా కౌంటర్ ఇచ్చారు. గతంలోనూ ఇదే తరహా సభలో అమ్మాయి కనబడితే ముద్దైన పెట్టాలి.. కడుపైనా చేయాలంటూ బాలకృష్ణ మాట్లాడారు.

ALSO READ: Balakrishna: నోరు జారిన బాలయ్య.. అక్కినేని ఫ్యాన్స్ వార్నింగ్

Tags:    
Advertisement

Similar News