Hanuman | హనుమాన్ సీక్వెల్ లో నటించే ఛాన్స్

Casting Call for Jai Hanuman - జై హనుమాన్ సినిమా కోసం యంగ్ టాలెంట్ ను తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాస్టింగ్ కాల్ ఇచ్చాడు.

Advertisement
Update: 2024-05-02 17:25 GMT

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి,

ఈ నేరకు ప్రశాంత్ వర్మ తన తదుపరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాడు. జై హనుమాన్ కోసం బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన యూనివర్స్ లో చేరాల్సిందిగా ఆహ్వానించాడు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.

దర్శకుడు ఒక నోట్ రాశాడు... "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అంటూ తన మెయిల్ ఐడీని ఇచ్చాడు.

జై హనుమాన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ పుకార్లన్నీ నిజమేనంటూ ఈమధ్య ప్రకటించాడు ప్రశాంత్ వర్మ.

Tags:    
Advertisement

Similar News