Telugu Global
Cinema & Entertainment

Balakrishna: నోరు జారిన బాలయ్య.. అక్కినేని ఫ్యాన్స్ వార్నింగ్

Balakrishna: అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చెప్పిన మాటల్ని పదే పదే రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. నాగార్జున అభిమానులు కూడా బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Akkineni fans and Netizens fire on Balakrishna in social media
X

బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జోరుమీదున్నారు. వరుసగా సినిమా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. ఈ సక్సెస్ మీట్స్ లో హుషారుగా మాట్లాడుతున్న బాలయ్య.. తాజాగా నోరు జారారు. అక్కినేని తొక్కినేని అంటూ రైమింగ్ వర్డ్స్ మాట్లాడి నాలిక కరుచుకున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరుతో జరిగిన సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చలేచింది. బాలయ్యని చెడామడా వాయించేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ వేదికపై బాలయ్య నోరు జారారు. ‘‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌ లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం’’ అనేశారు. అయితే ‘అక్కినేని.. తొక్కినేని’ అనగానే సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ వెంటనే మరో వ్యక్తి గురించి మాట్లాడడంతో ఎవరూ ఆ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన బుక్కైపోయారు.


అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చెప్పిన మాటల్ని పదే పదే రిపీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. బాలయ్యకు పొగరు అని, ఆయనకు నందమూరి ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ ఆనరని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. కొంతమంది నాగార్జున అభిమానులు కూడా బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మా అక్కినేని గురించి అంతమాట అంటారా, అన్నారు సరే.. కనీసం తర్వాత సారీ అయినా చెప్పరా అంటూ నిలదీస్తున్నారు.


ఇటీవలే దేవ బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ బాలయ్య రావణ బ్రహ్మ వారి గురువంటూ నోరు జారారు. ఆ తర్వాత క్షమాపణ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు బాలయ్య అక్కినేని ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించారు. ఈసారి కూడా ఆయన సారీ చెబుతారా, లేక వివాదాన్ని కొనసాగిస్తారా.. వేచి చూడాలి.

ALSO READ: బాలకృష్ణకు నాగేశ్వరరావు మనవళ్ల స్ట్రాంగ్ కౌంటర్

First Published:  24 Jan 2023 7:04 AM GMT
Next Story