పవన్ కు ఎందుకింత మంట ?

రూ.510 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం జగన్ పేదలగురించి మాట్లాడటం ఏమిటని పవన్ పదేపదే వెటకారంగా మాట్లాడుతున్నారు. జగన్ రూ. 510 కోట్లతో రిచ్చెస్ట్ సీఎం అయితే మరి చంద్రబాబుకు రూ. 668 కోట్ల ఆస్తులున్న విషయం పవన్ కు తెలీదా ?

Advertisement
Update: 2023-05-20 06:08 GMT

ఈమధ్య జగన్మోహన్ రెడ్డి తరచూ ఒక మాటంటున్నారు. అదేమిటంటే.. పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది (క్లాస్ వార్) అని. అందులో చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా యాజమాన్యాలు, చంద్రబాబు దత్తపుత్రుడు(పవన్ కల్యాణ్) అంతా పెత్తందార్లని జగన్ ఆరోపిస్తున్నారు. తాను పేదల తరపున, పేదలకోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు. సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను, అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీని అడ్డుకుంటున్నవారంతా పెత్తందార్లే అని జగన్ బహిరంగ సభల్లో చెబుతున్నారు.

ఈ విషయంపైనే పవన్ కు బాగా మండిపోతున్నట్లుంది. అందుకనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్న జగన్ తాను పేదవాడినని చెప్పుకుంటున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. రిచ్చెస్ట్ సీఎం పేదలగురించి మాట్లాడటం ఏమిటంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జగన్ తాను పేదవాడినని ఎప్పుడూ చెప్పుకోలేదు. తాను పేదవాళ్ళ కోసం పథకాలు అమలుచేద్దామని అనుకుంటే దాన్ని పెత్తందార్లు అడ్డుకుంటున్నారనే ఆరోపిస్తున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలను అడ్డుకున్నారు. అంతుకుముందు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంను అడ్డుకున్నారు.

అధికార వికేంద్రీకరణ పేరుతో ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించటాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తాను అనుకుంటే పెత్తందార్లు అడ్డుకుంటున్నట్లు జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడులాగ తన చేతికి వాచీలేదు, వేలుకి ఉంగరం లేదని ఏరోజూ చెప్పలేదు. నవరత్నాల రూపంలో పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే.. చంద్రబాబు, పవన్+ఎల్లోమీడియా రాష్ట్రాన్ని శ్రీలంక లాగ తయారు చేస్తున్నాడంటూ ఎంత గోలచేశారో అందరూ చూసిందే. పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే పెత్తందార్లు తట్టుకోలేకపోతున్నారని జగన్ వాళ్ళపై మండిపడ్డారు.

రూ.510 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం జగన్ పేదలగురించి మాట్లాడటం ఏమిటని పవన్ పదేపదే వెటకారంగా మాట్లాడుతున్నారు. జగన్ రూ. 510 కోట్లతో రిచ్చెస్ట్ సీఎం అయితే మరి చంద్రబాబుకు రూ. 668 కోట్ల ఆస్తులున్న విషయం పవన్ కు తెలీదా ? చంద్రబాబు పేదల గురించి మాట్లాడటంలేదా ? చంద్రబాబు పేదలగురించి కేవలం మాట్లాడుతారంతే. జగన్ ఆచరణలో చూపిస్తున్నారు. దాన్నే పవన్ తట్టుకోలేక జగన్ ను రిచ్చెస్ట్ సీఎం, రిచ్చెస్ట్ సీఎం అంటూ ఎద్దేవాచేస్తున్నది.

Tags:    
Advertisement

Similar News