చంద్రబాబు మీద మండిపడుతున్న పరిటాల కుటుంబం

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పరిటాల కుటుంబం ఆగ్రహంగా ఉందా ? వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో టిక్క‌ట్ విషయంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి మధ్యలో జరుగుతున్న వార్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్టులేవు.

Advertisement
Update: 2022-10-14 07:08 GMT

వచ్చేఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పూర్వవైభవం తీసుకువస్తుందని చంద్రబాబునాయుడు అంచనాలు వేసుకుంటున్న జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. అయితే ఈ జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు అంచనా నిజమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. మిగిలిన నియోజకవర్గాలు ఎలాగున్నా అనంతపురం, గుంతకల్, మడకశిర, పుట్టపర్తి, కల్యాణదుర్గం లాంటి నియోజకవర్గాల్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి.

వీట‌న్నింటినీ పక్కనపెట్టేస్తే ఎలాంటి గొడవలు లేకపోయినా చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టబోయే నియోజకవర్గంగా ధర్మవరం ప్రచారంలో ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి శ్రీరామ్ రెడీ అయిపోయారు. అయితే ఇదే నియోజవర్గంలో పోటీచేయబోయేది తానే అని వరదాపురం సూరి ప్రచారం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సూరిని కాదని నియోజకవర్గంలో జెండా పాతేందుకు శ్రీరామ్ చాలా ప్రయత్నాలుచేశారు.

అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. ధర్మవరంలోకి శ్రీరామ్ ను రానీయకుండా చంద్రబాబు అండతో అడ్డుకోవటంలో సూరి సక్సెస్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో సూరి ఓడిపోయారు. స్ధానిక రాజకీయాల కారణంగా టీడీపీలో ఉండలేక బీజేపీలోకి వెళిపోయారు. దాంతో నియోజకవర్గానికి గట్టి నేతలేకుండా పోయారు. వెంటనే శ్రీరామ్ ను పిలిచి చంద్రబాబు ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుండి శ్రీరామ్ నియోజకవర్గంలో యాక్టివ్ గానే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సూరి మళ్ళీ టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీచేయటం ఖాయమనే ప్రచారం మొదలైపోయింది.

ప్రచారం ప్రచారంలాగే ఉండిపోతే కథ వేరేగా ఉండేది. ఈమధ్యనే చంద్రబాబుతో సూరి భేటీ అయ్యారట. చంద్రబాబుతో సూరికి సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. భేటీ తర్వాత సూరి నియోజకవర్గంలో తిరుగుతు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయబోయేది తానే అని చెప్పుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో పరిటాల కుటుంబం సూరితో పాటు చంద్రబాబు మీదకూడా మండిపడుతోంది. మరి ఎన్నికలనాటికి ధర్మవరంలో టికెట్ విషయంలో పెద్ద గొడవే అయ్యేట్లుందనేది పార్టీలో టాక్. సో ధర్మవరంలో టికెట్ ఎవరికనే విషయంలో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్టులేవు.

Tags:    
Advertisement

Similar News