పాదయాత్రకు అడ్డొస్తే సినిమా చూపిస్తా.. లోకేష్ పంచ్ డైలాగులు

మనది సైకిల్ ప్రభుత్వం.. జగన్ ది సైకో ప్రభుత్వం అని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు నారా లోకేష్. యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు.

Advertisement
Update: 2023-05-20 17:16 GMT

యువగళం పాదయాత్రలో పంచ్ డైలాగులు పేలుస్తున్నారు నారా లోకేష్. సాగనిస్తే పాదయాత్ర అని, అడ్డుకుంటే దండయాత్ర అవుతుందని ఆయన వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. బనగానపల్లెలో యాత్ర కొనసాగించిన లోకేష్, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మనది సైకిల్ ప్రభుత్వం.. జగన్ ది సైకో ప్రభుత్వం అని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు నారా లోకేష్. టీడీపీ హయాంలో నీళ్లు... జగన్ హయాంలో కన్నీళ్లు వచ్చాయని మండిపడ్డారు. యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు.

క్లాస్ పాలిటిక్స్ అంటే.. ఏంటి..?

క్లాస్ పాలిటిక్స్ అంటూ ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన పేదవాడేంటి అంటూ మండిపడ్డారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే సబ్జెక్ట్ పై కౌంటర్ ఇచ్చారు. జగన్ నిస్సిగ్గుగా పేదవాడినని పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శించారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయలు విలువచేసే చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? అని ప్రశ్నించారు.

బదులు తీర్చుకుంటా..

తాము అధికారంలోకి వస్తే, తమ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించినవారిపై బదులు తీర్చుకుంటానని హెచ్చరించారు నారా లోకేష్. తమ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదన్నారు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన పవిత్ర నేల బనగానపల్లె అని అన్నారు లోకేష్. అలాంటి బనగానపల్లెలో తన యాత్రకు ప్రజల మద్దతు లభించిందని, రాష్ట్రమంతా ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News