మేకపాటికి సవాళ్ళు అవసరమా?

జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ తీసుకోవటానికి మేకపాటి అంగీకరించి ఉంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావు. జగన్‌ను నోటికొచ్చింది మాట్లాడటం, నేతలపై తొడలు కొట్టడం అంతా చూస్తుంటే మేకపాటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అనిపిస్తోంది.

Advertisement
Update: 2023-04-01 05:49 GMT

ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి బస్టాండ్ దగ్గర ఎంత ఓవర్ యాక్షన్ చేశారో అందరూ చూసిందే. దాదాపు రెండుగంటల పాటు వైసీపీ నేతలను పదేపదే రెచ్చగొట్టి గోలగోల చేశారు. తనముందుకు వస్తే తన కెపాసిటి ఏమిటో చూపిస్తానంటు రోడ్డుపైన కుర్చీవేసుకుని కూర్చున్నారు. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోబట్టి సరిపోయింది. లేకపోతే ఎమ్మెల్యేకి పెద్ద సమస్యే వచ్చేది.

మేకపాటిది ఓవర్ యాక్షన్ అని ఎందుకు అనడమంటే శుక్రవారం ఉదయం గుండెపోటు వచ్చింది. ఇంట్లో ఉండగానే సస్పెండెడ్ ఎమ్మెల్యేకి బాగా సఫోకేషన్ మొదలైంది. వెంటనే కుటుంబ సభ్యులు డాక్టర్లను పిలిపించారు. పరీక్షించిన వైద్యులు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని తేల్చారు. గురువారం సాయంత్రం వైసీపీ నేతలను రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోకపోయుంటే శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేకి గుండెపోటు వచ్చేది కాదేమో. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయ‌న‌ను చెన్నైకి తరలిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పోయిన నెలలోనే ఎమ్మెల్యేకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు పరీక్షించి రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. అంతకుముందు 2021లో కూడా అనారోగ్యంతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పరీక్షించిన డాక్టర్లు మేకపాటికి స్టంట్లు వేశారు. అంటే ఇప్పటికి మేకపాటికి గుండెపోటు రావటం ఇది మూడోసారి.

ఇంత తీవ్రమైన హార్ట్ ప్రాబ్లెమ్స్ పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరితో పడితేవాళ్ళతో గొడవలు దిగటం అవసరమా? గుండె సమస్యలే కాదు హైబీపీ, షుగర్ కూడా ఉందట. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చెప్పిన దగ్గరనుండి జగన్‌పై నోటికొచ్చింది మాట్లాడుతున్నారు మేక‌పాటి చంద్రశేఖరరెడ్డి. 66 సంవత్సరాల వయసులో ఆయ‌న‌కు ఈ గొడవలు అవసరమా? ఎప్పుడేమవుతుందో తెలియ‌ని గుండె సమస్యలు పెట్టుకుని ఏమి సాదిద్దామని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ తీసుకోవటానికి మేకపాటి అంగీకరించి ఉంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావు. జగన్‌ను నోటికొచ్చింది మాట్లాడటం, నేతలపై తొడలు కొట్టడం అంతా చూస్తుంటే మేకపాటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News