ఇంటిలో నుంచి గెంటేస్తే ఆదుకున్న వ్యక్తి జగన్

ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన దొంగలు మాత్రం రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని లక్ష్మీ పార్వతి విమర్శించారు. మౌనంగా ఉన్న తనను, జూనియర్ ఎన్టీఆర్‌ను పదే పదే రెచ్చగొట్టారన్నారు.

Advertisement
Update: 2022-09-27 05:15 GMT

తనను అర్ధ‌రాత్రి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఇంటిలో నుంచి వెళ్లగొడితే ఆ సమయంలో జగన్‌ తనకు అండగా నిలిచారని చెప్పారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తనకు జగన్‌మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇచ్చి, కాస్త కుదుటపడాల్సిందిగా సూచించారని.. అలాంటి సమయంలో అండగా నిలిచిన జగన్‌కు ఈ చిన్న విషయంలో ఇబ్బంది పెట్టడం తనకు మనసొప్పలేదన్నారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన ఒక రోజులో సమసిపోయిందని.. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన దొంగలు మాత్రం రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మౌనంగా ఉన్న తనను, జూనియర్ ఎన్టీఆర్‌ను పదే పదే రెచ్చగొట్టారన్నారు.

ఏబీఎన్‌లో మూడురోజుల పాటు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారని విమర్శించారు. తనను మరోసారి విలన్‌గా చూపించే కుట్ర చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా, యూనివర్శిటీ ఈ రెండింటిలో దేనికి ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే తాను జిల్లాకే పెట్టాలని కోరుకుంటానన్నారు. జగన్‌లో ఎలాంటి సంకుచిత స్వభావం లేదన్నారు.

బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగడమే కాకుండా.. ఆ తర్వాత ఒడిషాకు చెందిన గార్డును ఇంట్లో చంపేశారని.. ఆ సమయంలో వైఎస్‌ఆర్‌ అనుకుని ఉంటే ఏ పరిస్థితిలో ఉండేవారో బాలకృష్ణ గుర్తు చేసుకోవాలన్నారు. కీలు బొమ్మలా ఆడేందుకు ఎన్టీఆర్ సిద్ధపడకపోవడంతోనే రామోజీరావు చంద్రబాబుతో కలిసి కుట్ర చేశారన్నారు. నారా లోకేష్ వచ్చిన తర్వాతే ఆడవాళ్ల వ్యక్తిత్వాలను హననం చేయడం మరింత పెరిగిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. చేతగాని వారే ఇలాంటి పనులు చేస్తుంటారని చాణిక్యుడే గతంలో చెప్పారన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ ఎవరికో పుట్టారని కూడా ఈ రోజు ప్రచారం చేయించే స్థాయికి దిగజారిపోయారన్నారు.

Tags:    
Advertisement

Similar News