పవన్‌ను కాపులన్నా నమ్ముతున్నారా..?

ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీ అధినేతలు ఇద్దరూ బీసీలు, కాపులు కారు. కానీ మద్దతు మాత్రం అందుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయానా కాపు, పెద్ద సినీ సెలబ్రిటీ. కాబట్టి కాపులందరూ పవన్ వెంటే నిలబడాలి.

Advertisement
Update: 2022-11-30 07:25 GMT

అందరిలోనూ ఇప్పుడిదే అనుమానం పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సామాజికవర్గాల వారీగా సమావేశాలు పెట్టుకోవటం ఎక్కువైపోతోంది. మిగిలిన సామాజికవర్గాల సంగతి ఎలాగున్నా జనాభాలో అత్యధికంగా ఉన్నది బీసీలు, కాపులే. ఒక అంచనా ప్రకారం బీసీల జనాభా సుమారు 50 శాతం ఉంటే కాపుల జనాభా సుమారు 19 శాతముంటుంది. అంటే ఏ ఎన్నికల్లో అయినా పై రెండు సామాజికవర్గాల మద్దతు పార్టీలకు ఎంతవసరమో అర్థ‌మైపోతోంది.

జనాభా చాలా ఎక్కువగా ఉందికాబట్టి సహజంగానే పార్టీల దృష్టి బీసీలపైనే ఉంటుంది. ఇదే సమయంలో కాపుల జనాభా కూడా తక్కువేమీ కాదు. కాబట్టి కాపుల మద్దతును పొందేందుకు కూడా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మెజారిటీ బీసీలు ఏకతాటిపైన ఉన్నట్లు కాపులుండరు. కాపులు ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు మద్దతుగా నిలబడుతుంటారు. ఈ కారణంగానే రాజకీయంగా బీసీలు చూపించినంత ప్రభావం కాపులు చూపలేకపోతున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీ అధినేతలు ఇద్దరూ బీసీలు, కాపులు కారు. కానీ మద్దతు మాత్రం అందుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయానా కాపు, పెద్ద సినీ సెలబ్రిటీ. కాబట్టి కాపులందరూ పవన్ వెంటే నిలబడాలి. 19 శాతం ఓట్లున్న కాపులకు ప్రతినిధిగా పవన్ రాష్ట్ర రాజకీయాలను శాసించేస్థాయిలో ఉండాలి. మరి పవన్ అలాగే ఉన్నారా..? అంటే కచ్చితంగా లేరనే చెప్పాలి. ఎందుకంటే పవన్ పై కాపుల్లోనే నమ్మకంలేదు కాబట్టే.

పార్టీ పెట్టి ఇప్పటికి సుమారు 9 ఏళ్ళవుతున్నా సామాజికవర్గంలోని చెప్పుకోదగ్గ నేతల్లో ఒక్కళ్ళు కూడా పవన్ వెనకలేరు. ఎందుకంటే ప్రజారాజ్యంపార్టీ తాలూకు చేదు అనుభవాలు కాపుల్లోని కీలక నేతలను ఇంకా వెంటాడుతోంది కాబట్టే. చిరంజీవి దెబ్బకు సొంత సామాజికవర్గమే పవన్‌ను నమ్మటంలేదు. పోటీచేసిన రెండు నియోజవకర్గాల్లోనూ పవన్ ఓడిపోవటమే దీనికి నిదర్శనం. సొంత సామాజికవర్గంలోనే నమ్మకం సంపాదించుకోలేకపోయిన పవన్ను ఇతర సామాజికవర్గాలు ఎలానమ్ముతాయి..?

Tags:    
Advertisement

Similar News