జగన్ సభలో ఇలా జరిగిఉంటే..

ఇదే ఘటన జగన్ మీటింగ్ లో జరిగి ఉంటే.. ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్ స్పందన ఎంత దారుణంగా ఉండేద‌నే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంపై ప్రశ్నిస్తోంది.

Advertisement
Update: 2022-12-29 09:00 GMT

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. జనాలు బాగా తరలివచ్చారని డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరించేందుకే .. ఇరుకు సందులో టీడీపీ ఈ మీటింగ్ పెట్టిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 8 మంది మృతిచెందడం విషాదం. కాగా ఈ విషయంపై టీడీపీ అనుకూల మీడియాలో ఇదో ప్రమాద ఘటనే అన్నట్టుగా వార్తలు వచ్చాయి. టీడీపీ నిర్వాహకుల తప్పు ఉన్నట్టు ఎక్కడా ఒక్క వాక్యం కూడా లేదు.

మరోవైపు ఈ ఘటనపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. విచారం వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే.. ఇదే ఘటన జగన్ మీటింగ్ లో జరిగి ఉంటే.. ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్ స్పందన ఎంత దారుణంగా ఉండేద‌నే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంపై ప్రశ్నిస్తోంది. జగన్ సభలో గనక ఈ ఘటన జరిగి ఉంటే.. కచ్చితంగా ప్రభుత్వానిది.. వైసీపీదే తప్పని వీరంతా గ‌గ్గోలు పెట్టేవారు కదా.. అని వారు అంటున్నారు.

ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కూడా మానవతా దృక్పథంతో స్పందించారు. ఎక్కడా ఒక్క రాజకీయ కామెంట్ కూడా చేయకుండా.. బాధితులకు ప్రభుత్వం తరఫున సాయం ప్ర‌క‌టించారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉండి ఉంటే కచ్చితంగా రాజకీయకోణంలోనే విమర్శలు చేసేవారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ వారి లోపం కచ్చితంగా కనిపిస్తోందని.. ఇరుకు రోడ్డులో మీటింగ్ పెట్టినప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని వారు అంటున్నారు. జనం ఎంత మంది వస్తారన్న అంచనా లేకుండా ఎందుకు ఇటువంటి సభ నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News