హైకోర్టులో అయ్యన్నకు లభించని ఊరట

చింతకాయల అయ్యన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాల్సిందిగా అయ్యన్నపాత్రుడికి కోర్టు స్పష్టం చేసింది.

Advertisement
Update: 2022-11-09 08:40 GMT

ఏపీ హైకోర్టులో టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఊరట లభించలేదు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టును ఇది వరకు ఆశ్రయించారు. అయితే చింతకాయల అయ్యన్నపాత్రుడికి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాల్సిందిగా అయ్యన్నపాత్రుడికి కోర్టు స్పష్టం చేసింది.

అదే సమయంలో అయ్యన్నపాత్రుడిపై సీఐడీ మోపిన సెక్షన్ 467 ఈకేసులో వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరిగేషన్ కాలువకు చెందిన 0.16 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించడంతో పాటు... అందుకు ఫేక్ ఎన్‌ఓసీని సృష్టించారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ ఎన్‌వోసీ సృష్టించడం కోసం ఇరిగేషన్ శాఖ ఏఈ సంతకాన్ని ఫోర్జరీ చేశారని సీఐడీ కేసు పెట్టింది. అయితే ఎన్‌వోసీ అన్నది విలువ ఆధారిత సెక్యూరిటీ కిందకు రాదని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి అయ్యన్నపై 467 సెక్షన్ చెల్లుబాటు కాదని తీర్పు చెప్పింది. విచారణ కొనసాగింపున‌కు మాత్రం అనుమతి ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News