చంద్రబాబు అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి : సజ్జల

చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు నిన్న జరిగిన బోటు బోల్తా ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి.

Advertisement
Update: 2022-07-22 14:27 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గత రెండ్రోజులుగా చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాగా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పరామర్శలు పక్కకుపెట్టి.. తన సహజసిద్ధమైన ఆరోపణలకే ఆయన పరిమితమయ్యారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు నిన్న జరిగిన బోటు బోల్తా ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుపై సజ్జల తీవ్ర విమర్శలు చేశారు.

శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. బాబు ఏదో అనుకొని వరద బాధితుల పరామర్శకు వెళితే ఆయనకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైందని.. రావాల్సినంత స్పందన రాలేదని పేర్కొన్నారు.

వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందిందని చెప్పారు. వారికి సాయం అందలేదేమో.. రాజకీయం చేద్దామని వెళ్లిన‌ చంద్రబాబుకు పరిస్థితి ఎదురుతన్నిందని, దీంతో చంద్రబాబు నాయుడు ... ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువైందని విమర్శించారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద బాధితులకు ఒక్క రూపాయి అయినా సాయం చేశారా? అని ప్రశ్నించారు. కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రతిపక్ష నేతను తాము ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News