జనవరి 2.. ముహూర్తం ఫిక్సయిపోయిందా..?

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయిస్తే కాపులకు 5 శాతం దక్కచ్చు లేదా తగ్గచ్చు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ ఎందుకనో జాప్యంచేస్తున్నారు

Advertisement
Update: 2022-12-26 05:59 GMT

జనవరి 2.. ముహూర్తం ఫిక్సయిపోయిందా..?

నిరవధిక నిరాహార దీక్షకు ముహూర్తం జనవరి 2వ తేదీగా ఫిక్సయ్యింది. అసలు నిరాహారదీక్ష ఎవ‌రు, ఎందుకు చేస్తున్నారంటే..! కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సడెన్ గా పిక్చర్లోకి వచ్చారు. ఇంతకాలం ఏదో ప్రెస్ నోట్లు రిలీజ్ కే పరిమితమైన చేగొండి 86 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఒక్కసారిగా యాక్షన్లోకి దిగుతుండటం ఆశ్చర్యంగానే ఉంది.

అగ్రవర్ణాల్లోని పేదలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్ను జగన్ ఎందుకు అమలు చేయటంలేదంటూ జోగయ్య నిలదీస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అగ్రవర్ణాల్లోని పేదలకిచ్చిన 10 శాతం రిజర్వేషన్లో కాపులకు 5 శాతం కేటాయించాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన మాత్రమే. మొత్తం 10 శాతం రిజర్వేషన్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని చంద్రబాబు ఏ విధంగా నిర్ణయించారు..?

అంతకుముందు కాపులను బీసీల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఇచ్చి ఫెయిలయ్యారు కాబట్టే కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వు చేసి కాపులను ఉద్దరిస్తున్నట్లు ఫోజులు కొడదామని అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఎన్నికలు రావటం, ఘోరంగా ఓడిపోవటం, జగన్ అధికారంలోకి రావటం అన్నీ జరిగిపోయాయి. 10 శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం కాపు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ లాంటి అగ్రవర్ణాల్లోని జనాభా ప్రాతిపదికన అందరికీ పంచాలి. ఎవరి జనాభా ఎంతో తేలితేనే రిజర్వేషన్ కేటాయించటం సులభమవుతుంది.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయిస్తే కాపులకు 5 శాతం దక్కచ్చు లేదా తగ్గచ్చు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ ఎందుకనో జాప్యంచేస్తున్నారు. దీనిపైనే జోగయ్య నిరాహారదీక్షంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సున్నితమైన సమస్యను జగన్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరి జనవరి 2వ తేదీ తర్వాత ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News