ఏపీ సలహాదారు పదవికి మురళీ రాజీనామా

మరో ఏడాది పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఏపీ ప్రభుత్వంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు. మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చారని.. అందులో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

Advertisement
Update: 2022-10-01 02:56 GMT

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ రాజీనామా చేశారు. తెలంగాణకు చెందిన మురళీ అక్కడి కేసీఆర్‌ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వివాదంతో వీఆర్‌ఎస్ తీసుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఆయన్ను ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమానికి సలహాదారుగా నియమించారు.

మరో ఏడాది పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఏపీ ప్రభుత్వంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు. మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చారని.. అందులో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఇకపై తాను సొంత రాష్ట్రం తెలంగాణలో కూడా విద్యా, వైద్య రంగంలో మార్పుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

నాలుగు నెలల నుంచే ఆయన రాజీనామా చేయాలన్న భావనతో ఉన్నారు. సీఎం జగన్ సూచన మేరకు ఇప్పటి వరకు ఆగారని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News