రామోజీ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌కు ఢిల్లీ పెద్ద‌ల స‌పోర్టుందా..?

ఢిల్లీ పెద్దల అండతోనే రామోజీ మీద జగన్ యుద్ధం ప్రకటించారా? లేకపోతే తెర వెనుక ఉండి ఢిల్లీ పెద్దలే జగన్‌ను అడ్డుపెట్టుకుని రామోజీతో యుద్ధం చేస్తున్నారా?.. ఎందుకంటే మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని జగన్ రాష్ట్రానికి వచ్చిన రోజే మార్గదర్శికి చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను సీఐడీ సీజ్ చేసింది.

Advertisement
Update: 2023-05-30 06:10 GMT

కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎల్లో మీడియా యాజమాన్యానికి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై బురదచల్లేసి జనాల్లో జగన్‌పై వ్యతిరేకత తీసుకురావాలన్న టార్గెట్‌తో ఎల్లో మీడియా వార్తలు, కథనాలు వండివారుస్తున్న విషయం తెలిసిందే. ఎల్లో మీడియా ఇలా ఎందుకు చేస్తోందంటే ముఖ్యమంత్రి సీటులో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకోళ్ళు కూర్చుంటే తట్టుకోలేకపోతోంది కాబట్టే.

కేవలం చంద్రబాబు ప్రయోజనాల రక్షణకే ఎల్లో మీడియా ఇంతకు తెగబడి జగన్‌పైన బురదచల్లేస్తోంది. ఈ విషయం తెలిసినా జగన్ చాలాకాలం ఓపికతోనే ఉన్నారు. చంద్రబాబు మీద జగన్ యుద్ధం చేస్తున్నారే కానీ ఎల్లో మీడియా యాజమాన్యం జోలికి వెళ్ళలేదు. అయితే యాజమాన్యం తనలో కూడా అనేక లొసుగులు పెట్టుకుని మీద బండలేస్తుంటే జగన్ మాత్రం ఎంతకాలమని సహిస్తారు. అందుకనే 17 ఏళ్ళుగా నడుస్తున్న మార్గదర్శి కేసులో ప్రభుత్వం ఇంప్లీడయ్యింది. దాంతో ఎల్లో మీడియా యాజమాన్యం+మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు బండారమంతా బయటపడింది.

ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. రామోజీ మీద యుద్ధంలో జగన్‌కు ఢిల్లీ పెద్దల అండ ఎంతుంది అని. ఢిల్లీ పెద్దల అండతోనే రామోజీ మీద జగన్ యుద్ధం ప్రకటించారా? లేకపోతే తెర వెనుక ఉండి ఢిల్లీ పెద్దలే జగన్‌ను అడ్డుపెట్టుకుని రామోజీతో యుద్ధం చేస్తున్నారా? అని. ఎందుకంటే మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని జగన్ రాష్ట్రానికి వచ్చిన రోజే మార్గదర్శికి చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను సీఐడీ సీజ్ చేసింది.

ఇదివరకు కూడా జగన్ ఢిల్లీకి వెళ్ళొచ్చిన వెంటనే రామోజీ, ఆయన కోడలు శైలజకు సీఐడీ నోటీసులిచ్చి విచారణ మొదలుపెట్టింది. ఆస్తుల సీజింగ్ నేపథ్యంలో రేపో మాపో రామోజీ, శైలజ మీద సీఐడీ యాక్షన్ కూడా తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకంటే ఇంకో పెద్దాయన ఢిల్లీలోనే కీలకమైన స్ధానంలో ఉండేవారు కాబట్టి వీళ్ళ ఆటలు సాగినాయి. లేకపోతే రామోజీ వ్యవహారం ఎప్పుడో బయటపడుండేదట.

Tags:    
Advertisement

Similar News