ఫ్లెక్సీ కడితే సరిపోయిందా.. అభ్యర్థులేరీ..? - పవన్‌కి కొడాలి కౌంటర్‌

తెలుగుదేశం పార్టీ గానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గానీ, జనసేన గానీ, వామపక్షాలు గానీ, కాంగ్రెస్‌ పార్టీ గానీ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి ఉందా అని కొడాలి నాని ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-02-22 07:10 GMT

‘సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ కట్టిన ‘సిద్ధం’ ఫ్లెక్సీలకు పోటీగా ‘మేమూ సిద్ధం’ అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇదేవిధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయమై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా స్పందించారు.

ఫ్లెక్సీలకు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సరిపోదని కొడాలి నాని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతూ తాము సిద్ధమని చెబుతున్నారని, మరి పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులేరని ఆయన ప్రశ్నించారు. అభ్యర్థులను నిలబెట్టి.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ గానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గానీ, జనసేన గానీ, వామపక్షాలు గానీ, కాంగ్రెస్‌ పార్టీ గానీ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి ఉందా అని కొడాలి నాని ప్రశ్నించారు. తాము ‘సిద్ధం’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే.. అభ్యర్థులను నిలబెట్టకుండానే ‘మేమూ సిద్ధం’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు.

Tags:    
Advertisement

Similar News