సీబీఐ కోర్టుల తరలింపున‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఒకటో అదనపు కోర్టును విశాఖలోనే ఉంచి, రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సీబీఐ కేసులను అక్కడే విచారిస్తారు.

Advertisement
Update: 2022-09-29 06:36 GMT

విశాఖలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి రెండు కోర్టుల తరలింపున‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే ఈ పక్రియను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు విశాఖలో మూడు సీబీఐ అదనపు కోర్టులు నడుస్తున్నాయి. ఏపీకి సంబంధించిన కేసులన్నీ అక్కడే విచారిస్తున్నారు.

వాటిలో రెండు కోర్టుల తరలింపున‌కు 2020లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా కోర్టుల బదిలీకి అనుమతి ఇవ్వాలని విశాఖ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి హైకోర్టును కోరారు. అందుకు హైకోర్టు సమ్మతించింది. కోర్టుల తరలింపును చేపట్టాలని విశాఖ, కర్నూలు, కృష్ణా జిల్లాల జడ్జిలను ఆదేశించింది.

ఒకటో అదనపు కోర్టును విశాఖలోనే ఉంచి, రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సీబీఐ కేసులను అక్కడే విచారిస్తారు.

Tags:    
Advertisement

Similar News