చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? కమ్ముకుంటున్న కేసులు

అయితే కాలం గిర్రునతిరగటంతో ఇప్పుడు చంద్రబాబును దెబ్బకొట్టే అవకాశం జగన్ కు వచ్చింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితులుగా ఉండేవారిలో నలుగురు ఒక్కసారిగా దర్యాప్తు సంస్ధల చేతిలో చిక్కారు.

Advertisement
Update: 2022-12-05 05:22 GMT

బలవంతుడైన ప్రత్యర్ధిని దెబ్బకొట్టాలంటే ముందు చుట్టూ ఉన్నవాళ్ళని దెబ్బతీయాలనేది రాజనీతి. ప్రత్యర్ధికి అత్యంత సన్నిహితులను, అండగా నిలిచేవారిని దెబ్బకొడితే ఆటోమేటిగ్గా ప్రత్యర్ధి బలహీనపడిపోతాడని దీనర్ధం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జరుగుతున్నదిదే. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లోపు ఎంతవీలైతే అంత చంద్రబాబును దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పావులుకదుపుతున్నారు. ఒకప్పుడు ఇదేపద్దతిలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు.

అయితే కాలం గిర్రునతిరగటంతో ఇప్పుడు చంద్రబాబును దెబ్బకొట్టే అవకాశం జగన్ కు వచ్చింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితులుగా ఉండేవారిలో నలుగురు ఒక్కసారిగా దర్యాప్తు సంస్ధల చేతిలో చిక్కారు. సోమవారం హైదరాబాద్ లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వందల కోట్లరూపాయల నిధులను షెల్ కంపెనీలకు తరలించారనేది వీళ్ళపైన ఉన్న ఆరోపణ.

వీళ్ళపైన ఉన్నవి ఆరోపణలు కావు నిధుల మళ్ళింపు నిజమే అని ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయ్యిందట. అందుకనే విచారణకు హాజరవ్వాలని నోటీసిచ్చింది. ఇంతకుముందే మాజీ మంత్రి నారాయణపై సీఐడీ విచారణ మొదలైంది. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సీఐడీ విచారణ చేస్తోంది. ఈయనపై ఇప్పటికే రాజధాని భూమసమీకరణ, రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అవినీతి, అమరావతి భూముల బినామీ కొనుగోళ్ళ కేసులున్నాయి. కోర్టు స్టే కారణంగా విచారణ ఆగింది. కోర్టు స్టే ఎత్తేస్తే వెంటనే విచారణ మొదలవుతుంది. అప్పుడు నారాయణతో పాటు చంద్రబాబు అండ్ కో మీద కూడా విచారణ జరుగుతుంది.

ఇక వైసీపీ తరపున గెలిచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రఘురామరాజు కూడా ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోళ్ళ కేసులో నిందితులతో సన్నిహిత సంబంధాలున్నాయని, కొనుగోళ్ళకు అవసరమైన నిధులను అందిస్తానని హామీ ఇచ్చారనే ఆరోపణలను ఎంపీ ఎదుర్కొంటున్నారు. నాలుగురోజుల క్రితమే విచారణకు పిలిచిన ఈడీ ఎందుకనో చివరినిముషంలో వద్దనిచెప్పింది. మళ్ళీ ఏదోరోజు విచారణకు పిలవటం ఖాయం. పై నలుగురూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, రాజధాని భూముల అవినీతిలో ఎవరు అప్రూవర్ గా మారిపోయినా ఇరుక్కోవటం ఖాయమనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News