ప‌ళ‌ని స్వామి ఎన్నిక చెల్ల‌దు..న‌న్ను నాయ‌కురాలిని చేయండి : శ‌శిక‌ళ

ఎఐఎడిఎంకె లో సృష్టించిన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి చెల్లదని, కొన్ని స్వార్ధ‌పూరిత శ‌క్తుల కోసం పార్టీ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కుతున్నార‌ని పార్టీ బ‌హిష్కృత నేత‌,దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు వికె శ‌శిక‌ళ అన్నారు. ఇ పళనిస్వామి (ఇపిఎస్) కోసమే ఈ ప‌ద‌విని సృష్టించార‌న్నారు. ఆయ‌న ప‌ద‌వే చెల్ల‌న‌ప్పుడు ఇక ప‌న్నీరు సెల్వంను బహిష్కరించే అధికారం ఆయనకు లేదని అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు కూడగట్టేందుకు శ‌శిక‌ళ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ […]

Advertisement
Update: 2022-07-12 22:46 GMT

ఎఐఎడిఎంకె లో సృష్టించిన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి చెల్లదని, కొన్ని స్వార్ధ‌పూరిత శ‌క్తుల కోసం పార్టీ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కుతున్నార‌ని పార్టీ బ‌హిష్కృత నేత‌,దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు వికె శ‌శిక‌ళ అన్నారు. ఇ పళనిస్వామి (ఇపిఎస్) కోసమే ఈ ప‌ద‌విని సృష్టించార‌న్నారు. ఆయ‌న ప‌ద‌వే చెల్ల‌న‌ప్పుడు ఇక ప‌న్నీరు సెల్వంను బహిష్కరించే అధికారం ఆయనకు లేదని అన్నారు.

తన రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు కూడగట్టేందుకు శ‌శిక‌ళ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ లో జ‌రుగుతున్న తాజా ప‌రిణామాల‌పై ఆమె పుదుకోట్టైలో విలేకరులతో మాట్లాడారు.
జులై 11న జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లదని, స్వార్థపూరిత ఉద్దేశ్యంతో ఏకపక్షంగా సమావేశమయ్యారని ఆమె అన్నారు. " నేను జనరల్ సెక్రటరీని కావాల‌నేదే పార్టీ కార్యకర్తల కోరిక . కేడర్ ఎంపిక చేసిన వ్యక్తి మాత్రమే పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారు అని ఆమె అన్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఈపీఎస్‌కు అన్నాడీఎంకే కార్యకర్తలు తగిన సమాధానం చెప్పాలని శశికళ పిలుపునిచ్చారు.

జయలలిత హయాంలో పార్టీ కోశాధికారి పార్టీ ఆర్థిక నివేదికలను చదివేవారని, కానీ 'యథేచ్ఛగా' జరిగిన ఈ సమావేశంలో ఆ ప్రకటనలను చదివినది పార్టీ కోశాధికారి ఓపీఎస్ కాదని ఆమె అన్నారు. జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదని చెప్పడానికి ఇది మరో కారణమని ఆమె అన్నారు.

పార్టీ కార్యాలయానికి సీలు వేయడంతో రాష్ట్ర ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు బాధపడ్డారని, రానున్న రోజుల్లో పార్టీ క్యాడర్‌కు ఈపీఎస్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

Tags:    
Advertisement

Similar News