ప్రజాగ్రహాన్ని తట్టుకోలేరు.. వైసీపీకి పవన్ వార్నింగ్..

వరుసగా రెండో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్ విజయవాడలో ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వాటిని పంపిస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజల్లో ఆగ్రహం వస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ప్రజలు వైసీపీ నేతల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తారు జాగ్రత్త అని చెప్పారు పవన్ కల్యాణ్. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తనని బూతులు తిట్టినా సహిస్తామని, కానీ ప్రజలకు […]

Advertisement
Update: 2022-07-10 02:55 GMT

వరుసగా రెండో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్ విజయవాడలో ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వాటిని పంపిస్తానని హామీ ఇచ్చారు.

అదే సమయంలో ప్రజల్లో ఆగ్రహం వస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ప్రజలు వైసీపీ నేతల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తారు జాగ్రత్త అని చెప్పారు పవన్ కల్యాణ్. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తనని బూతులు తిట్టినా సహిస్తామని, కానీ ప్రజలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషిచేస్తోందని చెప్పారు పవన్ కల్యాణ్. విజయవాడలో జనవాణి నిర్వహించిన పవన్, తానే స్వయంగా అర్జీలు స్వీకరించారు. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రజలు ఇల్లు కట్టుకుంటే దాన్ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, లాక్కోవాలని చూస్తున్నారని, 20 ఏళ్లుగా ఆ ఇంటిలో ఉంటున్నవారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.

పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు..

రాష్ట్రంలో అధి నాయకులు ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా తన దృష్టికి వచ్చాయన్నారు. అధికార మదంతో ఉన్నారు కాబట్టే వైసీపీ నేతలంటే తనకు చిరాకు అన్నారు పవన్.

ఒక నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలం అని, కానీ వైసీపీలో ఆ నాయకుడి లక్షణాలే అందరికీ వచ్చాయని, గ్రామ స్థాయి వరకు అందరు నాయకులు అదే పని చేస్తున్నారని అన్నారు. విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారని, ఈ అన్యాయాలను ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయన్నారు.

రేణిగుంట మండలం కరకంబాడిలో ఓ వాలంటీర్ ఇంటిని వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు లాక్కున్నారని, దాన్ని బాధితులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. ఆ బాధ్యతను వైసీపీ మంత్రులు తీసుకోవాలని, అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలు వస్తాయన్నారు. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని, నాయకుల్ని తరిమి తరిమి కొడతారన్నారు పవన్ కల్యాణ్.

Tags:    
Advertisement

Similar News