#BYEBYEMODI: ఇవ్వాళ్ళ జాతీయ స్థాయిలో సోషల్ మీడియా ట్రెండ్

ఇవ్వాళ్ళ ట్విట్టర్ లో #BYEBYEMODI హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో నెంబర్ 1 ట్రెండింగ్ గా నిల్చింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమయిందంటూ, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే అంటూ నెటిజనులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా […]

Advertisement
Update: 2022-06-23 04:21 GMT

ఇవ్వాళ్ళ ట్విట్టర్ లో #BYEBYEMODI హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో నెంబర్ 1 ట్రెండింగ్ గా నిల్చింది.
దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమయిందంటూ, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే అంటూ నెటిజనులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కూడా నెటిజనులు పోస్టులు పెట్టారు.

#BYEBYEMODI ట్రెండ్ గా మారడంతో టిఆర్ఎస్ పార్టీ లోని మంత్రులు, ఎమ్మేల్యేలు సైతం తమ ట్వీట్ల ద్వారా మోడీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. మధ్యాహ్నం మూడు గంటలవరకే దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటి ఎండగడుతూ, పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మొదలుకొని ద్రవ్యోల్బణం దాకా, విద్వేషాలు, మూక దాడులు, అసహనం తదితర అంశాలపై నెటిజనులు విమర్శలు సంధించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి రైతుల ఖర్చులను డబుల్ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా బిజెపి ప్రభుత్వం భారతీయులని వెనక్కి తీసుకొచ్చినప్పుడు చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ దేశానికి పాలించే నాయకుడు కావాలి కానీ పబ్లిసిటీ కోసం పాటుపడే నాయకుడు వద్దంటూ ట్వీట్ చేశారు.

అదాని – బీజేపీ బంధాన్ని, కార్పొరేట్ల కోసం, వారి ప్రయోజనాల‌ కోసం బిజెపి అనుసరిస్తున్న విధానాలను నెటిజనులు దుమ్మెత్తిపోశారు. ఇటీవల శ్రీలంక లో అదాని కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి మోదీ మధ్యవర్తిత్వం వహించిన అంశాన్ని, భారతదేశంలో బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి ఆస్ట్రేలియాలో ఉన్న అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు.

వివిధ పార్టీల నాయకులే కాక జాతీయ స్థాయిలో నెటిజనులు మోడీ విధానాలపై విమర్షలు గుప్పించారు. ఉత్తరభారతం నుంచి కూడా నెటిజనులు మోదీ పాలనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రోజు #BYEBYEMODI అంశమే ట్విట్టర్ లో చర్చనీయాంశం అవడం బీజేపీ నాయకులకు మింగుడుబడటం లేదు.

Tags:    
Advertisement

Similar News