‘అగ్నిపథ్’ ఈ దేశానికి భారం – బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ

కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‘ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. బీహార్ లో అయితే యువత పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ‘అగ్నిపథ్’ పథకం ఈ దేశానికి భారమంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ఈ రోజు లేఖ రాశారు. ”ఈ పథకంపై అనేక మంది యువకులు తమ అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. ఈ పథకం ద్వారా రిక్రూట్ అయిన 75 […]

Advertisement
Update: 2022-06-16 04:55 GMT

కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‘ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. బీహార్ లో అయితే యువత పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ‘అగ్నిపథ్’ పథకం ఈ దేశానికి భారమంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ఈ రోజు లేఖ రాశారు.

”ఈ పథకంపై అనేక మంది యువకులు తమ అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. ఈ పథకం ద్వారా రిక్రూట్ అయిన 75 శాతం మంది నాలుగేళ్ళ తర్వాత పదవీ విరమణ చేస్తారు. వాళ్ళకు పెన్షన్ ఉండదు, ఆ తర్వాత వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిందే” అని తన లేఖలో పేర్కొన్నారు వరుణ్ గాంధీ.

ప్రతి సంవత్సరం ఇలా నిరుద్యోగులయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసే సాధారణ సైనిక సిబ్బందిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కార్పొరేట్ రంగం పెద్దగా ఆసక్తి కనబరచనప్పుడు నాలుగేళ్ళలో రిటైర్డ్ అయ్యే ఈ సైనికులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు.

నాలుగేళ్ల సర్వీసు వల్ల వారి చదువుకు ఆటంకం కలిగుతుందని, అదే విద్యార్హతతో ఇతరులతో పోటీ పడి ఉద్యోగం పొందడం కానీ పై చదువులు చదవడం కానీ సాధ్యం కాదని వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారని ఆయన అన్నారు. ఈ పథకం యువతలో మరింత అసంతృప్తిని పెంచుతుందని వరుణ్ గాంధీ ఆందోళన వెలిబుచ్చారు.

Tags:    
Advertisement

Similar News