జగన్‌ను ఉద్దేశించి ఆ మాట అన‌లేదు " RRR

తనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లో వైసీపీ చేసిన ఆరోపణలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. జగన్‌ నాయకత్వాన్ని రఘురామ బొచ్చులో నాయకత్వం అంటూ కించపరిచారని వైసీపీ ఆరోపించింది. దీనికి స్పందించిన రఘురామకృష్ణంరాజు.. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తానెప్పుడూ బొచ్చులో నాయకత్వం అనలేదన్నారు. వైసీపీ సమర్పించిన వీడియోను ఎడిట్ చేసి తయారు చేశారన్నారు. గతంలో తాను నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో.. కార్యకర్తలు కొందరు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒక వ్యక్తి నాయకత్వం […]

Advertisement
Update: 2022-05-24 05:50 GMT

తనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లో వైసీపీ చేసిన ఆరోపణలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. జగన్‌ నాయకత్వాన్ని రఘురామ బొచ్చులో నాయకత్వం అంటూ కించపరిచారని వైసీపీ ఆరోపించింది.

దీనికి స్పందించిన రఘురామకృష్ణంరాజు.. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తానెప్పుడూ బొచ్చులో నాయకత్వం అనలేదన్నారు. వైసీపీ సమర్పించిన వీడియోను ఎడిట్ చేసి తయారు చేశారన్నారు. గతంలో తాను నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో.. కార్యకర్తలు కొందరు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒక వ్యక్తి నాయకత్వం వర్ధిల్లాలి అని అంటుంటే.. ”ఆపండి.. బొచ్చులో నాయకత్వం” అని మాట్లాడానని.. ఆ వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించి చేసినవి కాదన్నారు రఘురామకృష్ణంరాజు. ఎడిట్ చేసి సమర్పించిన వీడియోకు కౌంటర్‌గా తన వద్ద ఉన్న అసలైన వీడియోను సమర్పించానన్నారు.

ఆర్టికల్ 350ఏను అవమానించినట్టు మాట్లాడానని మరో అభియోగం చేశారన్నారు. ఆర్టికల్ 350ఏ … ఏ రాష్ట్రమైనా సరే .. అక్కడి మాతృభాషను చదువుకునేందుకు అవకాశం కల్పించాలని చెబుతోందన్నారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని.. ఏపీ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారని.. దానికి తాను జోక్యం చేసుకుని.. తమ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పానన్నారు. తెలుగు అకాడమీకి లక్ష్మీపార్వతిని చైర్మన్‌గా నియమించిన అంశాన్ని కూడా ప్రస్తావించానన్నారు.

ఏపీ ప్రభుత్వం తెలుగు భాష మీద చేస్తున్న దాడిని ప్రస్తావించకుండా, తాను చాలా హుందాగా 350ఏ కొన్ని రాష్ట్రాల్లో ఉల్లంఘనకు గురవుతోందని మాత్రమే లోక్‌సభలో చెప్పానన్నారు. 350ఏను పరిరక్షించాలని తాను చెబితే.. తాను రాజ్యాంగాన్ని అవమానించానని ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కనీసం తాను మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉంటాయన్న జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు.

ఈ అంశంపైనే ఆ తర్వాత జగన్‌మోహన్ రెడ్డి వివరణ కోరగా.. తాను ఏం తప్పు మాట్లాడలేదని, అపార్థం చేసుకుంటున్నారని వివరించానన్నారు. ఈ అంశంపై క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదని నేరుగా ముఖ్యమంత్రికే చెప్పానన్నారు.

ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒకరేనని… కాబట్టి ముఖ్యమంత్రిని విమర్శించినా పార్టీ అధ్యక్షుడిని విమర్శించినట్టే కాబట్టి వేటు వేయాలని మార్గాని భరత్ డిమాండ్ చేయడాన్ని రఘురామ తప్పుపట్టారు. పార్టీ అధ్యక్షుడు హోదాలో మద్య నిషేధం చేస్తా.. చేయకుంటే ఓట్లు కూడా అడగనని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని.. అదే ముఖ్యమంత్రి హోదాలో మాత్రం నాలుగు రెట్లు రేటు పెంచడంతో పాటు రాబోయే 20ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు కూడా పెట్టేశారని రఘురామ వ్యాఖ్యానించారు.

వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని పార్టీ అధ్యక్షుడు హోదాలో హామీ ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం జగన్‌కు అవగాహన లేదు పట్టించుకోవద్దని సజ్జల చెబుతున్నారని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డే పార్టీ అధ్యక్షుడి హోదాలో ఒకలా, సీఎం హోదాలో మరోలా వ్యవహరిస్తున్నప్పుడు.. ఈ రెండు హోదాలు ఒకటే అని మార్గాని భరత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. తాను పార్టీ అధ్యక్షుడిగా జగన్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నానని.. సీఎంగా తీసుకున్న నిర్ణయాలనే విమర్శిస్తున్నానని చెప్పారు . ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తనకు ఉందన్నారు.

తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని జగన్‌ భావిస్తే మొదట తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ చేతనైతే చేయగలింది కేవలం అదొక్కటేనన్నారు. అంతకు మించి తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదన్నారు. లోక్‌సభలో కూడా ఏనాడు కేంద్ర ప్రభుత్వ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేయాలని వైసీపీ విప్ జారీ చేసిన పరిస్థితి కూడా లేదన్నారు.

ALSO READ: కేటీఆర్ మంత్రాంగం… తెల‍ంగాణకు భారీగా తరలి వస్తున్న పెట్టుబడులు

Tags:    
Advertisement

Similar News