వడ్డించేవాడు మనవాడైతే..

వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి. తాజాగా భారత యుద్ధనౌకకు ‘ఉదయగిరి’ అనే పేరు పెట్టడం కూడా ఇలాంటి ఉదాహరణే. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పర్వతప్రాంతం పేరు ఉదయగిరి. ఆ పేరుతో నెల్లూరు జిల్లాలో ఓ పట్టణం కూడా ఉంది, అది అసెంబ్లీ నియోజకవర్గం కూడా. సడన్ గా ఈ పేరుని భారత యుద్ధనౌకకు ఎందుకు పెట్టారు, ఏపీనుంచి ఏమైనా ప్రతిపాదన వెళ్లిందా, లేక బలమైన లాబీయింగ్ జరిగిందా అనే అనుమానం అందరికీ వచ్చింది. […]

Advertisement
Update: 2022-05-18 03:50 GMT

వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి. తాజాగా భారత యుద్ధనౌకకు ‘ఉదయగిరి’ అనే పేరు పెట్టడం కూడా ఇలాంటి ఉదాహరణే. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పర్వతప్రాంతం పేరు ఉదయగిరి. ఆ పేరుతో నెల్లూరు జిల్లాలో ఓ పట్టణం కూడా ఉంది, అది అసెంబ్లీ నియోజకవర్గం కూడా. సడన్ గా ఈ పేరుని భారత యుద్ధనౌకకు ఎందుకు పెట్టారు, ఏపీనుంచి ఏమైనా ప్రతిపాదన వెళ్లిందా, లేక బలమైన లాబీయింగ్ జరిగిందా అనే అనుమానం అందరికీ వచ్చింది. అయితే భారత రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న జి.సతీష్ రెడ్డి నెల్లూరు జిల్లావాసి కావడం వల్లే యుద్ధ నౌకకు ‘ఉదయగిరి’ అనే పేరు పెట్టారని తెలుస్తోంది. సతీష్ రెడ్డి స్వగ్రామం ఆత్మకూరు నియోజకవర్గంలోని మహిమలూరు. ఉదయగిరి అనేది ఆ ప్రాంతానికి దగ్గర కావడంతో చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉదయగిరి’ పేరు యుద్ధనౌకకు పెట్టడంలో ఆయన పాత్ర ఉందని చెబుతున్నారు.

సహజంగా జాతీయ స్థాయిలో తీసుకునే ఏ నిర్ణయాల్లో అయినా ముందు ఉత్తరాది రాష్ట్రాలకే గుర్తింపు ఉంటుంది. జాతీయ స్థాయి ప్రాజెక్ట్ లకి, పథకాలకి, ఇతర చిహ్నాలకు ఉత్తరాది లేదా హిందీ పేర్లు పెడుతుంటారు. కానీ ఇక్కడ ఉదయగిరి అనేది పూర్తిగా దక్షిణాది పదం. తొలిసారి ఏపీకి దొరికిన అరుదైన గౌరవం. భారత యుద్ధ నౌకకు ఏపీలోని ఓ ప్రాంతం పేరు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. పుట్టిన ఊరుని, సొంత ప్రాంతాన్ని గుర్తు పెట్టుకునేవారు ఉంటే.. వాటికి మరింత గుర్తింపు లభిస్తుందనడానికి ఇదే మంచి ఉదాహరణ.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఉదయగిరి, సూరత్ యుద్ధ నౌకలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రారంభించారు. ఇవి రెండూ నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయని అన్నారాయన. ఉదయగిరి, సూరత్‌ యుద్ధనౌకలను నౌకాదళంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ (DND) డిజైన్‌ చేసింది. ముంబైలోని మజగావ్‌ డాక్‌ యార్డ్ ఈ రెండు నౌకలను నిర్మించింది. త్వరలో వీటికి తుది మెరుగులు దిద్ది, నౌకాదళానికి పూర్తి స్థాయిలో అప్పగిస్తారు. ఈ యుద్ధ నౌకల తయారీతో.. నౌకా నిర్మాణ రంగంలో ఇతర దేశాల అవసరాలను కూడా తీర్చే సత్తా భారత్ కు ఉన్నట్టు స్పష్టమైంది.

Tags:    
Advertisement

Similar News