సూర్య దంపతులపై కేసు నమోదు..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది జై భీమ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. సూర్య దంపతులు సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఒక వర్గం నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల […]

Advertisement
Update: 2022-05-18 03:13 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది జై భీమ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. సూర్య దంపతులు సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఒక వర్గం నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల హీరో, దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేయాలని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ చెన్నై నగరంలోని వేళచ్చేరి పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు. అయితే ఆయన చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు. దీంతో ఆయన సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిని కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు తాజాగా వేళచ్చేరి పోలీసులు సూర్య దంపతులు, ఈ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై కేసు నమోదు చేశారు. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మన్ననలు పొందినటువంటి సినిమాను నిర్మించిన సూర్య దంపతులపై కేసు నమోదు కావడం కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా జై భీమ్ సినిమాను నిర్మించారు. చంద్రు పాత్రలో సూర్య నటించారు.

Tags:    
Advertisement

Similar News