సర్కారోడుగా మారిన రామ్ చరణ్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా దిల్ రాజుకు ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం. ఇప్పుడీ సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మూవీకి సర్కారోడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సర్కారోడు టైటిల్ ను రివీల్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు చరణ్. సినిమా మొత్తం ప్రభుత్వం, అందులోని […]

Advertisement
Update: 2022-03-09 21:16 GMT

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా దిల్ రాజుకు ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం. ఇప్పుడీ సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మూవీకి సర్కారోడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సర్కారోడు టైటిల్ ను రివీల్ చేస్తారని అంటున్నారు.

ఈ సినిమాలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు చరణ్. సినిమా మొత్తం ప్రభుత్వం, అందులోని వ్యవస్థల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి సర్కారోడు అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా కనిపించబోతున్నాడు. నిజానికి తండ్రి పాత్ర కోసం చిరంజీవి లేదా మరో సీనియర్ నటుడ్ని అనుకున్నారు.

కానీ శంకర్ మాత్రం చరణ్ తోనే తండ్రి పాత్ర చేయించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు రాజమండ్రిలో ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. సినిమాలో చరణ్ తండ్రి పాత్రకు జోడీగా అంజలి, చరణ్ యంగ్ క్యారెక్టర్ కు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేరిన సంగతి తెలిసిందే. డీల్ లో భాగంగా సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నీ జీ పరమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News