తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు..

కరోనా కేసులు తగ్గుతున్నా, తెలంగాణలో లాక్ డౌన్ ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 12నుంచి అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు నేటితో ముగుస్తుండగా.. దాన్ని మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. కేబినెట్ భేటీలో ఈమేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ని కాస్త మార్చారు. ఇప్పటి వరకు ఉదయం 6గంటలనుంచి 10గంటల వరకు మాత్రమే కర్ఫ్యూనుంచి వెసులుబాటు ఉండేది. ఉదయం 10గంటల […]

Advertisement
Update: 2021-05-30 09:04 GMT

కరోనా కేసులు తగ్గుతున్నా, తెలంగాణలో లాక్ డౌన్ ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 12నుంచి అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు నేటితో ముగుస్తుండగా.. దాన్ని మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. కేబినెట్ భేటీలో ఈమేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ని కాస్త మార్చారు.

ఇప్పటి వరకు ఉదయం 6గంటలనుంచి 10గంటల వరకు మాత్రమే కర్ఫ్యూనుంచి వెసులుబాటు ఉండేది. ఉదయం 10గంటల తర్వాత కఠినంగా ఆంక్షలు అమలు చేస్తుండేవారు. ఇప్పుడా వెసులుబాటు సమయాన్ని మరో 3గంటలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. రోడ్లపైకి వచ్చినవారు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంటసేపు అవకాశం ఇచ్చారు. అంటే మధ్యాహ్నం 2గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదు. ట్రాఫిక్ జామ్ తో ఇంటికెళ్లలేకపోయాం అని తప్పించుకునే అవకాశం కూడా ఉండదనమాట. మధ్యాహ్నం 2గంటలనుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. అత్యవసర సేవలు సహా ప్రభుత్వం గతంలో వెల్లడించిన కార్యకలాపాలకు లాక్‌ డౌన్‌ నుంచి యథావిధిగా మినహాయింపు కొనసాగుతుంది.

గతంతో పోల్చి చూస్తే తెలంగాణలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఢిల్లీలాంటి కొన్ని రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగింపుకే నిర్ణయించిన వేళ, తెలంగాణ ప్రభుత్వం కూడా 10రోజులపాటు కర్ఫ్యూని పొడిగించింది. సడలింపు వేళలు పెంచి ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించింది.

Tags:    
Advertisement

Similar News