బీజేపీలోకి మెట్రో మ్యాన్‌ ! కేరళ ఎన్నికలపైనే గురి !

కేరళ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కుమ్మరించింది. మెట్రో విస్తరణతో పాటు కేరళలో అభివృద్ధి పనులకు ఈసారి కేటాయింపులు పెంచింది. ఇప్పుడు వలసలకు ఒకే అంటోంది. కేరళలో యుడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కొత్త ఫేస్‌ల కోసం బీజేపీ వెతుకుంతోంది. ఇందులో భాగంగా మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ఇ.శ్రీధరన్‌కు కమలం కండువా కప్పాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి బీజేపీ విజయ యాత్ర మొదలుకాబోతోంది. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమయ్యే రోజే […]

Advertisement
Update: 2021-02-18 02:19 GMT

కేరళ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కుమ్మరించింది. మెట్రో విస్తరణతో పాటు కేరళలో అభివృద్ధి పనులకు ఈసారి కేటాయింపులు పెంచింది. ఇప్పుడు వలసలకు ఒకే అంటోంది. కేరళలో యుడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కొత్త ఫేస్‌ల కోసం బీజేపీ వెతుకుంతోంది. ఇందులో భాగంగా మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ఇ.శ్రీధరన్‌కు కమలం కండువా కప్పాలని నిర్ణయించింది.

ఆదివారం నుంచి బీజేపీ విజయ యాత్ర మొదలుకాబోతోంది. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమయ్యే రోజే శ్రీధరన్‌ పార్టీలో చేరుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరన్‌ పోటీ చేస్తారు. శ్రీధరన్‌కు ప్రస్తుతం 88 ఏళ్లు. ఈ వయస్సులో ఆయన ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఓ ప్రశ్న. అయితే తమ పార్టీ ఇమేజ్‌ను పెంచే ఫేస్‌ల కోసం వెతుకుతున్న బీజేపీకి ఈయన దొరికారని తెలుస్తోంది.

మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌కు 2001లో పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 2008లో పద్మవిభూషణ్‌ కూడా వచ్చింది. జైపూర్‌, లక్నో, కొచ్చి మెట్రో డిజైన్లలో శ్రీధరన్‌ కీలక పాత్ర పోషించారు. ఏపీలో విజయవాడ, వైజాగ్‌లో మెట్రో సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చారు .

మెట్రోమ్యాన్‌గా శ్రీధరన్‌ పాపులర్‌. ఢిల్లీ మెట్రో వ్యవహారాలు చూసిన ఆయన 2011లో రిటైర్‌ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News