ఇషా చావ్లా రీఎంట్రీ
లాంగ్ గ్యాప్ తర్వాత ఇషా చావ్లా మళ్లీ సినిమాల్లోకొచ్చింది. గతంలో అల్లరినరేష్, బాలకృష్ణ, ఆది లాంటి హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. రీఎంట్రీలో మరింత అందంగా తయారై వచ్చింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం అగోచర. కమల్ కామరాజు, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం `అగోచర`. స్పానిష్ థ్రిల్లర్ చిత్రం జూలియా ఐస్ స్పూర్తితో ఈ మూవీ రూపొందుతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న […]
లాంగ్ గ్యాప్ తర్వాత ఇషా చావ్లా మళ్లీ సినిమాల్లోకొచ్చింది. గతంలో అల్లరినరేష్, బాలకృష్ణ, ఆది లాంటి
హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. రీఎంట్రీలో మరింత అందంగా తయారై వచ్చింది. ఆమె నటిస్తున్న
తాజా చిత్రం అగోచర.
కమల్ కామరాజు, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ తొలిసారి
దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అగోచర'. స్పానిష్ థ్రిల్లర్ చిత్రం జూలియా ఐస్ స్పూర్తితో ఈ మూవీ
రూపొందుతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని
అందమైన ప్రదేశాలలో ప్రారంభమైంది. గడ్డకట్టే చల్లటి వాతావరణ పరిస్థితుల్లో ఈ చిత్రం షూటింగ్
జరుపుకుంటోంది.
హైలెట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఇషా చావ్లా డబుల్ రోల్లో నటించడం. ఆమె పాత్రలోని భిన్న ఛాయలు ఆడియన్స్‌ని ప్రతి క్షణం థ్రిల్ చేసేలా ఉంటాయట. కమల్ కామరాజు ఆమెకు మద్దతు ఇచ్చే భర్త పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా ఉండనుంది.